Tuesday, November 18, 2014

నీకు నీవే..... --- ఒక కవిత

మిత్రమా
నీతో నువ్వెప్పుడైనా మాట్లాడావా?
మాట్లాడు.. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతాడు
నీ అంతరంగం విన్నవా ఎపుడైనా?
విను.. ఆ హృదయ సాగర ఘోష ని
ముందు నీవెవరో తెలుసుకో
అపుడు నీ వారెవరో తెలుసుకో
నీవే నిజం
నీ ప్రపంచం లో నువ్వు మాత్రమే ఉన్నావ్ నేస్తం...
ఎందుకంటే ఎవరి ప్రపంచాలు వాళ్లకున్నాయి
నీతో కడ దాకా ఉండేది నువ్వే
నీ జీవితం.....
నువ్వే జీవించాలి
నీకు ఆకలేస్తే నువ్వే తినాలి..
నీకు నిద్రొస్తే నువ్వే నిద్రపోవాలి..
కష్టం వస్తే కన్నీరు నీకే..
కష్టం చేస్తే ఆ కారే చెమట కూడా నీకె..
నీకు నువ్వే రాజువి... నీకు నువ్వె బానిస వి...
నీకు నీవే.....

Monday, November 10, 2014

నిజమైన ప్రేమ...

ఈ ఆర్టికల్ ప్రజాశక్తి లో వచ్చింది ఈరోజు..


ఇక్కడ

అపుడెపుడో రాసిన కవిత

తెలుగువన్ లో కూడా వచ్చింది... ..

కాలం ఒక ప్రవాహం..
కాలం ఒక ప్రవాహం..
అది నిత్యం పరిగెడుతుంది..
తనలో ఎన్నో మార్పులు ప్రతిక్షణం

గతించిన కాలం లో ....
మనిషి తన నీడల్ని వెతుకుతున్నాడు..
చరిత్ర లో తన పేజీలు ఉన్నాయేమో అని చూస్తున్నాడు

ముందు ఆదిమ కాలం
అక్కడ తనకు గుడ్డలే లేవు
సిగ్గేసి వచ్చేశాడు

తర్వాత రాచరిక కాలం
బానిసత్వపు ఛాయలు చూసి
బాధేసింది

ప్రజాస్వామ్య కాలం
చాలా బాగుంది అనుకున్నాడో లేదో
ఎక్కడొ అవినీతి కంపు మొదలైంది..

ఇక వెతకడం పిచ్చి పని
అనుకున్నాడో ఏమో...
వెతకడం మానేసి...
కన్నీటిని రాల్చాడు...
చిత్రం గా ఆ కన్నీరు కూడ...
ఆ ప్రవాహం లోనే..............

రచన - పవన్ కుమార్
pavanjalla@gmail.com
 

పున:ప్రారంభం

బ్లాగుని మళ్ళీ రాస్తున్నా... ఆదరించండి....